ETV Bharat / state

పటాన్​చెరులో 21 కోట్లతో 132కేవీ సబ్​ స్టేషన్​ - MLA Mahipal reddy Latest news

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో రూ. 21 కోట్ల నిధులతో 132 కేవీ సబ్ స్టేషన్​ను నిర్మించనున్నట్లు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి తెలిపారు. డీఈ గోపాల్ రావుతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈనెల 21న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

Establishment of 132 KV Sub Station with 21 Crores at Patancheru in Sangareddy district
పటాన్​చెరులో 21 కోట్లతో 132కేవీ సబ్​ స్టేషన్​
author img

By

Published : May 18, 2020, 5:42 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో నిర్మించబోతున్న 132 కేవీ సబ్​ స్టేషన్​ను ఈ నెల 21వ తేదీన ఆర్థిక మంత్రి హరీశ్​ రావు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు. దీనిని 21 కోట్ల నిధులతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనితోపాటు పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాక నాణ్యమైన విద్యుత్తు అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.