ఆవు కడుపులో నుంచి ఏకంగా 50 కిలోల ప్లాస్టిక్‌తో ఇతర వ్యర్థాలు బయటపడ్డాయి. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ప్లాస్టిక్‌తో పాటు ఇతర వ్యర్థాలు తిని అనారోగ్యానికి గురై కదలలేని స్థితిలో ఉన్న ఆవుకు పశువైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు. అమీన్ పూర్ గోశాలలో నాలుగు గంటలు శ్రమించి ఆవు కడుపులోంచి ప్లాస్టిక్ కవర్లు, మేకులు, గాజు ముక్కలు, బట్టలు తొలగించారు.
ఈ వ్యర్థాలు 50 కిలోల ఉన్నట్లు డాక్టర్ విశ్వచైతన్య వెల్లడించారు. ప్రస్తుతం ఆవు కూర్చోగలుగుతుందని, వారం రోజుల్లో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 100వ రోజుకు చేరిన రైతు ఉద్యమం