సంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి.. పలువురు వాహన దారులు, ఆసుపత్రి సిబ్బంది, దుకాణాల నిర్వాహకులకు.. రూ. 40 వేల విలువ చేసే మాస్క్‌లు (mask), శానిటైజర్లను (sanitizer) పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపత్కాలంలో కరోనాపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్నా కొవిడ్ మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భాస్కర్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ను తప్పని సరిగా ధరిస్తూ.. శానిటైజర్ వాడాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Vaccination center: సూపర్ స్ప్రెడర్లందరూ టీకాలు తీసుకోవాలి: సీఎస్