ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎస్జీటీ అభ్యర్థులకు సంగారెడ్డి కలెక్టరేట్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ నిఖిలా రెడ్డి హాజరయ్యారు. ఎస్జీటీ అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 500 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు.
ఇవీచూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య