సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం బీడీఎల్ టౌన్షిప్, పటాన్చెరు అంబేడ్కర్ కాలనీలో వచ్చిన కొత్త కేసులతో కలుపుకుని మెుత్తం 13 కేసులు నమోదయ్యాయి. కొత్తగా బీడీఎల్ టౌన్షిప్లో మూడు కేసులు, పటాన్చెరు అంబేడ్కర్ కాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారణ చేశారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 కేసులు నమోదయ్యాయని అధికారులు నిర్ధారణ చేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన వారెవరో తెలుసుకుంటున్నారు. వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనాపై అవగాహనే లక్ష్యంగా ఘనంగా 'మాస్క్డే'