ETV Bharat / state

సంగారెడ్డి కలెక్టరేట్​లో సహకార మార్కెటింగ్​ సదస్సు

సంగారెడ్డి కలెక్టర్​లో సహకార మార్కెటింగ్​ సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్​ హనుమంతరావు... రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించి వాటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

author img

By

Published : May 20, 2020, 5:28 PM IST

cooperative-marketing-conference-at-sangareddy-collectorate
సంగారెడ్డి కలెక్టరేట్​లో సహకార మార్కెటింగ్​ సదస్సు

సంగారెడ్డిలోని కలెక్టరేట్​ ఆవరణలో జిల్లా సహకార మార్కెటింగ్​ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి కలెక్టర్​ హనుమంతరావు పాల్గొన్నారు.

రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించి వాటి కొరత లేకుండా చూడాలని కలెక్టర్​ అన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటను వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థలకే అవకాశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సహకార సంఘంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వారికి కారణమైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కరోనా వ్యాప్తిలో భాగంగా సహకార సంఘాల వద్ద ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించేలా సదుపాయాలు కల్పించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్​, సహకార సంఘాల ఛైర్మన్​లు, సీఈవోలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మోదీ ప్యాకేజీతో పూర్తిగా గట్టెక్కడం కష్టమే: మూడీస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.