సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులు ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా... అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. కంగ్టి మండలం నాగూరు గ్రామానికి చెందిన శంకర్‌గా విచారణలో తేలింది. పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని వడ్డెర కాలనిలో ఉంటూ ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. శంకర్ వద్ద నుంచి 4 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: చెరువులో పడ్డ బంగారు గొలుసును వెతికిపెట్టిన రోబో!