సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భూవాణి కార్యక్రమం నిర్వహించారు. రైతులు, పట్టాదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆదేశాల మేరకు అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక కౌంటర్లు, మీసేవ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మండలంలోని 16 గ్రామాలకు చెందిన రైతులు భూములకు సంబంధించిన సమస్యలపై అర్జీలు సమర్పించారు. అప్పటికప్పుడు పరిష్కరించిన భూ సమస్యలపై రైతులకు ప్రొసిడింగ్ కాపీలను అందజేశారు.
ఇవీ చూడండి: అది నిజంగా పోలీస్ స్టేషనే..!