కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజార్షి షా వైద్యులను ఆదేశించారు. జహీరాబాద్ వైద్య విధాన పరిషత్తు ప్రాంతీయ ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
వైద్య సేవల తీరును పరిశీలించారు. భోజన వసతి, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా చికిత్సలకు అవసరమైన మందులు, ఔషధాలపై ఆరా తీశారు. అంతకు మునుపు కల్వరి టెంపుల్ చర్చిలో ఏర్పాటు చేస్తున్న 100 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని రాజార్షి షా పరిశీలించారు.
ఇదీ చదవండి: ఉల్లంఘనులపై ఉక్కుపాదం.. రాచకొండలో 25 వేలకు పైగా కేసులు