సంగారెడ్డి జిల్లాకు చెందిన రఘురామ్ రెడ్డికి రెండేళ్ల క్రితం హయత్‌నగర్‌కు చెందిన అనూషతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కొంతకాలం బాగానే గడిచిన వీరి సంసారంలో తగాదాలు మొదలయ్యాయి. భరించలేని అనూష బాబుని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. 8 నెలలు గడిచినా అత్తింటివారు ఆమెను తీసుకెళ్లేందుకు రాలేదు. ఇంకెన్నాళ్లు పుట్టింట్లో ఉండటమని అత్తారింటి వెళ్లేందుకు నిశ్చయించుకుంది.
అనూష తల్లిదండ్రులు తమ కూతురిని అత్తవారింటి వద్ద దింపడానికి వచ్చారు. ఈ క్రమంలో రఘురామ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అనూష, ఆమె తల్లిదండ్రులపై దాడి చేశారు. అనూషకు, ఆమె తల్లికి గాయాలయ్యాయి.
ఈ ఘటనపై అనూష పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి