కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రైతు సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి వారిని ఇబ్బందులు కలిగించే చట్టాలను ప్రవేశపెట్టడం ఏంటని పలువురు నాయకులు ప్రశ్నించారు.
రైతులకు భాజపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఎస్ఎఫ్ఐ నేతలు అన్నారు. వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి... రైతు సంక్షేమానికి అవసరమయ్యే చట్టాలను తీసుకురావాలని కోరారు.
ఇదీ చదవండి: కనీస మద్దతు ధరపై మోదీ హామీ