ETV Bharat / state

అన్నదాతల భూముల్లో అక్రమ రిసార్ట్​లు

50 ఏళ్లుగా ఆ భూములనే సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని పేదలుగా గుర్తించి ఆ భూములను అసైన్డ్ చేస్తూ పట్టా పుస్తకాలు జారీ చేసింది. ఆ భూమిపై కన్నేసిన ఓ బడాబాబు.. అక్రమంగా ప్రవేశించాడు. భూమి తనదంటూ హద్దులు పాతాడు. బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు కూడా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ... పేదలను ఇబ్బందులు పెడ్తున్నారు.

అన్నదాతల భూముల్లో అక్రమ రిసార్ట్​లు
author img

By

Published : Aug 3, 2019, 5:45 PM IST

అన్నదాతల భూముల్లో అక్రమ రిసార్ట్​లు

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామ పరిధిలోని 92, 112, 154, 187 సర్వే నెంబర్లలో దాదాపు 700 ఎకరాల వరకు అసైన్డ్‌ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం వీటిని పేదలకు పంపిణీ చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. ఇటీవల జరిగిన భూరికార్డుల ప్రక్షాళన తర్వాత వారికి కొత్త పాసు పుస్తకాలు రాలేదు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు రైతులు విన్నవించగా త్వరలో సర్వే చేసి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. వీటి పక్కనే ఉన్న పట్టా భూములను కొనుగోలు చేసిన కొందరు బడాబాబులు ఇదే అదునుగా భావించి... అసైన్డ్ భూముల్లో హద్దులు పాతారు.

అన్నదాతలపై బైండోవర్ కేసులు

విషయం తెలిసిన రైతులు తమ భూముల్లో హద్దు రాళ్లు ఎందుకు నాటుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి ఎలా చొచ్చుకొని వస్తారంటూ ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రైతులపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ముందు బైండోవర్‌ చేశారు. తమ భూములు లాక్కున్న వారిపై కేసులు నమోదు చేయకుండా తమపై చర్యలు తీసుకోవడమేంటంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారి పేరు చెప్పి తమను భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

కుంటను పూడ్చేశారు

పేదల భూములను అక్రమించుకున్న వ్యక్తులు.. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఈ భూముల మధ్యలో ఉన్న ఓ నీటికుంటను పూడ్చి వేశారు. ఇతర చెరువులకు అనుబంధంగా ఉన్న వాగులను పూడ్చి వేశారు. అంతేకాకుండా రైతులు తమ పొలాలకు వెళ్లే బాటలను కూడా మూసి వేశారు. సమీపంలోని ప్రభుత్వ భూముల్లో వేలాది లారీల మట్టిని అక్రమంగా తవ్వి రిసార్ట్ నిర్మాణం కోసం వినియోగించారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ రాజ్, రెవిన్యూ అధికారులు పట్టనట్టుగా వ్యవహరించడం గమనార్హం.

పొంతన లేని సమాధానాలు

ఈ వ్యవహారంపై అధికారుల స్పందన పొంతన లేకుండా ఉంది. కేవలం రైతులనే ఎందుకు బైండోవర్ చేస్తున్నారని తహసీల్దార్ బాలరాముడిని వివరణ కోరగా... గ్రామంలో గొడవ జరుగుతోందని పోలీసులు తీసుకువచ్చారని అందుకే బైండోవర్ చేశామని తెలిపారు. కుంట, అసైన్డ్ భూముల అక్రమించుకున్నారని తహసీల్దార్ స్పష్టం చేస్తున్నప్పటికీ... అక్కడ జరుగుతున్న పనులను మాత్రం ఆపడం లేదు.

ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని... ఎలాగైనా సమస్యలను తీర్చి తమ భూములు తమకిప్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఐఏఎస్​ మద్యం మత్తుకు పాత్రికేయుడు బలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.