ETV Bharat / spiritual

తిరుమలలో ఉన్న జాపాలి తీర్థం గురించి తెలుసా? ఒక్కసారి ఆ అంజన్నను దర్శిస్తే చాలు! - JAPALI THEERTHAM

దుష్ట గ్రహ దోషాలు, ఆర్థిక , మానసిక బాధలు తొలగించే హనుమాన్ జన్మస్థలం జాపాలి తీర్థం గురించి తెలుసా?

Japali Theertham Hanuman Temple
Japali Theertham Hanuman Temple (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 5:15 AM IST

Japali Theertham Hanuman Temple Tirumala History : అచంచలమైన భక్తికి, దాస్యానికి మారుపేరు ఆంజనేయుడు. ఆంజనేయునికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే హనుమంతుని జన్మించిన ప్రదేశంగా పేరుగాంచిన జాపాలి తీర్థం విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆంజనేయుని జన్మ స్థలమే జాపాలి
వ్యాస మహర్షి రచించిన స్కాందపురాణంలోని వేంకటాచల మహత్యం లో వివరించిన ప్రకారం ఏడు కొండల్లో ఓ కొండ హనుమంతుని మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్ధిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాబాలి తీర్థం ఉన్న ప్రదేశం.

హనుమ నామ స్మరణతో తొలగే గ్రహపీడలు
సాధారణంగా అనునిత్యం ఇంట్లో హనుమంతుని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్త భూత ప్రేత పిశాచాలు , సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక, మానసిక, శత్రు బాధలు తొలగి లక్ష్మీదేవి దేవి ఆ ఇంట స్థిరనివాసం ఉంటుంది. ఆ ఇంట్లో నిత్యం శుభకార్యాలు జరుగుతాయని శాస్త్ర వచనం. అలాంటిది సాక్షాత్తూ హనుమాన్ జన్మించిన ప్రదేశం జాపాలిని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయి.

జాపాలి తీర్థం విశిష్టత
జాపాలి మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. జాపాలి తీర్ధం చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. స్కంద పురాణంలో, వేంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో కనిపిస్తుంది. ప్రకృతి రమణీయతల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి తో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.

పురాణ గాథ
జాపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా రుద్రుడు ప్రత్యక్షమై తన రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాపాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరుతాయి కాబట్టి జాపాలి తీర్థంగా పేరొందింది.

వాక్‌ దోషాన్ని పోగొట్టుకున్న జాబాలి
రామాయణంలోని అయోధ్య కాండలో జాపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్‌ దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాక్‌ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి.

హనుమంతుని స్వరూపమే
జాపాలి తీర్థంలో వెలసిన హనుమంతుని ఆలయం అత్యంత రమణీయంగా ఉంటుంది. గర్భాలయంలో వెలసిన స్వామి సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి వారి శిరస్సుపై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి.

శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం
రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థం లో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం కూడా ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయ్. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటి ఉన్నాయి. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లే భక్తులు జాబాలి తీర్ధాన్ని కూడా దర్శించడం పరిపాటి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు జాబాలి తీర్థం కూడా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ హనుమతే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.