హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా... ప్రస్తుతం 1785.80 అడుగుల నీటిమట్టం ఉంది.
హిమాయత్ సాగర్ జలాశయంలోకి 1,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా 1715 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.25 అడుగుల నీటిమట్టం ఉంది.
వరద నీరు తగ్గుతుండడం వల్ల ఉస్మాన్‌సాగర్ మొత్తం గేట్లను జలమండలి అధికారులు మూసివేశారు. హిమాయత్‌సాగర్ రెండుగేట్లు మూసివేశారు.
ఇదీ చూడండి: నిండుకుండలా హిమాయత్‌సాగర్ జలాశయం.. గేట్లు ఎత్తే అవకాశం!