ETV Bharat / state

దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం: అనురాధ రాంరెడ్డి

తుర్క‌యంజాల్ మున్సిపాలిటీలో దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని ఛైర్ ప‌ర్స‌న్ అనురాధ రాంరెడ్డి తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యత క్రమం సిద్ధం చేసుకున్నామని ఆ ప్రకారం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించారు. మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఛైర్ పర్సన్ శంకుస్థాపన చేశారు.

turkayamjal
turkayamjal
author img

By

Published : Jul 18, 2022, 8:16 PM IST

తుర్కయంజాల్ మున్సిపాలిటీ క‌మ్మ‌గూడ 19వ వార్డు ప‌రిధిలోని సుభాష్‌న‌గ‌ర్‌లో స్థానిక కౌన్సిల‌ర్ నార‌ని కవితా శేఖ‌ర్‌గౌడ్‌తో క‌లిసి అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నుల‌కు మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ అనురాధ రాంరెడ్డి శంకుస్థాప‌న చేశారు. తుర్క‌యంజాల్ పుర‌పాలిక ప‌రిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి ప‌నులు విడతలవారీగా చేయడానికి కృషి చేస్తాన్నానని అనురాధ రాంరెడ్డి తెలిపారు. ప్రాధాన్య క్ర‌మంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి పైప్‌లైన్ ప‌నులు చేప‌డుతున్నామ‌న్నారు. కాంట్రాక్ట‌ర్లు అభివృద్ధి ప‌నుల‌ను నాణ్య‌తతో చేప‌ట్టాల‌ని ఆమె సూచించారు.

స్థానికులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా దిశలవారీగా అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తానని మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైస్ ఛైర్ ప‌ర్స‌న్ గుండ్ల‌ప‌ల్లి హ‌రిత, కాంగ్రెస్ నాయ‌కులు రొక్కం చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, శేఖ‌ర్‌గౌడ్‌, కాల‌నీవాసులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.