
రంగారెడ్డి జిల్లా జడ్పీ పీఠం మరోసారి అధికార తెరాస కైవసం చేసుకుంది. మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచిన తీగల అనితాహరినాథ్ రెడ్డిని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖైరతాబాద్ జడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికలో కడ్తాల్ జడ్పీటీసీ సభ్యుడు దశరథ్... అనితారెడ్డి పేరును ప్రతిపాదించగా శంషాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు తన్వి బలపర్చింది. ఎన్నికను పరిశీలకులు లోకేశ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా తలకొండపల్లి జడ్పీటీసీ ఈటె గణేశ్‌ను ఎన్నుకున్నారు. జడ్పీ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్‌ను మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి శాసనసభ్యులు అభినందించారు. తెరాస శ్రేణులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఇవీ చూడండి: వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా సునీతామహేందర్ రెడ్డి