మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేసిన కేసులో భార్య సహా మరో నలుగురికి జీవిత ఖైదు, జరిమానా పడింది (life time imprisonment in murder case). 2015లో జరిగిన ఈ హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు(ranga reddy district court).. దోషులకు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలవరించింది.
2015లో మీర్పేట్ ఠాణాపరిధిలో బండి సురేశ్ అనే వ్యక్తిని అతడి భార్య శ్రీలత హత్య చేసింది. మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని మరో నలుగురు బంధువులతో కలిసి భర్తను అంతమొందించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆరేళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించింది. మృతుని భార్యతో పాటు మరో నలుగురికి జీవిత ఖైదు, రూ.10 చొప్పున జరిమానా విధించింది.
ఇదీ చూడండి: Junior Artist Suicide News: ప్రియుడు కాదన్నాడని.. సూసైడ్ చేసుకున్న టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్