Rajendranagar Rahul Murder Case Update : ధూల్‌పేటకు చెందిన కమల్‌సింగ్, సత్యనారాయణసింగ్, ఆనంద్సింగ్లు అన్నదమ్ములు. కమల్‌సింగ్‌కు మృతుడు రాహుల్‌సింగ్ (Rajendranagar Rahul Murder Case Update), వికాస్‌సింగ్ కుమారులు. సత్య నారాయణసింగ్‌కు రాజాసింగ్ అలియాస్ గోపీసింగ్, ఆనంద్‌సింగ్‌కు.. వినోద్సింగ్లు కుమారులు. కమల్‌సింగ్ కుటుంబం ప్రస్తుతం మణికొండ పుప్పాలగూడలో నివాసం ఉంటోంది. మిగిలిన వారు షేక్‌పేటలో నివాసం ఉంటున్నారు.
మొదటి నుంచి వినోద్‌సింగ్, గోపీసింగ్లు కలిసి మెలిసి ఉంటున్నారు. కానీ వారు రాహుల్‌సింగ్, వికాస్సింగ్లను దూరం పెట్టారు. వీరికి తాతల నుంచి వచ్చిన ఆస్తిలో మణికొండలో 100 గజాల స్థలం ఉంది. దీంతో పాటు అదే ప్రాంతంలో 267 గజాల వాణిజ్య సముదాయం ఉంది. 100 గజాల వ్యవహారంలో ముగ్గురికి భాగం రావాల్సి ఉండగా దాన్ని రాహుల్.. వినోద్‌సింగ్, గోపీసింగ్కు రాకుండా అడ్డుపడుతున్నాడు.
కాగా వాణిజ్య సముదాయంలో ఉన్న దుకాణాల నుంచి వచ్చిన అద్దెలను.. వినోద్, గోపీలు తీసుకుంటున్నారు. వాటిలో రాహుల్ అతని సోదరుడకి మాత్రం ఇవ్వడం లేదు. దీంతో తరచూ రాహుల్ అక్కడకు వెళ్లి దుకాణదారులను బెదిరిస్తున్నాడు. దీంతో పాటుగా వారి నాయనమ్మ రత్నాభాయికి ఉన్న 750 గజాల స్థలాన్ని డెవలప్మెంట్కు ఇవ్వగా.. రెండు విల్లాలు వీరికి వచ్చాయి. వీటిని ఆమె గోపీకి, వినోద్‌కు ఇచ్చింది.
Hyderabad Girl Murder Case in Bangalore : 'ఆకాంక్ష' మర్డర్ కేసు.. ప్రియుడికి లుక్ అవుట్ నోటీసు
నాయనమ్మ నుంచి వచ్చిన ఆస్తిలోనూ వినోద్, గోపీలు.. తనకు భాగం ఇవ్వడం లేదని తరచూ రాహుల్ గొడవకు దిగుతున్నాడు. పలుమార్లు ఘర్షణకు కూడా దిగారు. ఈ విషయమై వారి పెద్దలు వారికి సర్ది చెప్పారు. ఈ క్రమంలోనే విల్లాలకు గానూ తాను రూ.40 లక్షలు ఇస్తానని గోపీసింగ్ చెప్పగా.. వినోద్‌సింగ్ రూ.20 లక్షలు ఇస్తానని రాహుల్‌కు చెప్పారు. కానీ ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని రాహుల్.. వారితో గొడవకు దిగాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని వినోద్, గోపీసింగ్లు నిర్ణయించుకున్నారు.
రాహుల్ నిత్యం జిమ్‌కు వెళుతుంటాడు. అతని దేహదారుఢ్యం చూసి తమపై దాడులు చేస్తాడని.. ఎప్పటికైనా ప్రమాదమేనని హత్య చేయించాలనుకున్న వినోద్‌సింగ్, గోపీసింగ్లు.. రెండు నెలల క్రితం వారికి పరిచయం ఉన్న టోలీచౌకికి చెందిన అక్బర్ వద్దకు వెళ్లారు. రాహుల్‌ను హతమార్చాలని అతనికి చెప్పారు. ఇందుకు రూ.15 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చున్నారు. మొదటగా రూ.10 లక్షలు ఇచ్చారు.
"రాహుల్ సింగ్ అనే వ్యక్తి సెలబ్రెటీ జిమ్ కోచ్. జిమ్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో హత్యకు గురైయ్యాడు. ఇప్పుడు చనిపోయిన రాహుల్ సింగ్, వికాస్ సింగ్ కమాల్ సింగ్ పిల్లలు. కమాల్ సింగ్ వాళ్లు ముగ్గురు బ్రదర్స్. వారు సత్యనారాయణ సింగ్, ఆనంద్ సింగ్. వీరికి ఆస్తి విషయంలో గొడవలు ముందు నుంచి ఉన్నాయి. ఈ ఆస్తుల విషయంలో గొడవ కారణంగా సుపారీ ఇచ్చి హత్య చేశారు." - జగదీశ్వర్ రెడ్డి, డీసీపీ రాజేంద్రనగర్
Rajendranagar Murder Case Update : రాహుల్ నిత్యం రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న.. అత్తాపూర్‌లోని సెలబ్రెటీ జిమ్‌కు వెళతాడని తెలిసిన అక్బర్ అదే సమయంలో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్బర్ తనకు తెలిసిన షాబాజ్, ఇర్ఫాన్, మహమూద్, మాజీద్, అప్సర్లను కలిసి విషయం చెప్పాడు. వీరంతా స్థానికంగా పెయింటింగ్ పని చేస్తూ జీవిస్తున్నారు. హత్య చేసేందుకు ఒప్పుకుంటే వారికి ఒక్కొక్కరికీ రూ.40,000 నుంచి రూ.1.5 లక్షల వరకూ ఇస్తానని అక్బర్ చెప్పాడు.
ఇందుకు వారంతా సరే అన్నారు. రెండు నెలల నుంచి అప్సర్.. రాహుల్‌ను అనుసరిస్తున్నాడు. ఈ విషయాలు షాబాజ్, ఇర్ఫాన్లకు చెబుతూ వస్తున్నాడు. హత్యకు ఇర్ఫాన్ ఆయుధాలు సమకూర్చాడు. రాహుల్‌ను నేరుగా ఎదుర్కొంటే ప్రమాదమని.. షాబాజ్ పెప్పర్ స్ప్రే తెచ్చాడు. గత నెల 29న సాయంత్రం రాహుల్ ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న నిందితులు జిమ్ సమీపంలో క్వాలిస్ వాహనంలో వేచి చూశారు. చివరి నిమిషంలో భయంతో అప్సర్ మాత్రం హత్యలో పాల్గొనలేదు.
కానీ ఇర్ఫాన్, షాబాజ్, మాజిద్‌లు.. రాహుల్ కోసం సెల్లార్లో అతని ద్విచక్ర వాహనం వద్ద కాపు కాచారు. ఓ వ్యక్తి క్వాలిస్ వాహనంలో బయట సిద్ధంగా ఉండగా.. మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిద్దంగా ఉన్నాడు. రాహుల్ సెల్లార్లోకి రాగానే.. షాబాజ్ అతని కంట్లో పెప్పర్ స్ప్రేను చల్లాడు. దీంతో భయంతో రాహుల్ అక్కడే ఉన్న వాచ్‌మెన్ వెనుక దాక్కున్నాడు. ఈ క్రమంలోనే ఇర్ఫాన్, మాజిద్, షాబాజ్‌లు.. రాహుల్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.
ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..
ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు.. వినోద్‌సింగ్, గోపీసింగ్తో పాటు.. అక్బర్ అండ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఒక క్వాలిస్ వాహనం, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు, రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తామని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన నిందితులకు త్వరగా శిక్షపడేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Couple Murder Kamareddy : భర్తను కొట్టి.. భార్యకు ఉరేసి.. దారుణ హత్య.. దోపిడీ దొంగల పనేనా?
దిల్లీలో దారుణం.. యువతి తలపై రాడ్‌తో కొట్టి హత్య.. పెళ్లికి నో చెప్పినందుకే!