హైదరాబాద్ మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యపై పలు కాలనీల వాసులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. పదిహేను రోజులకు ఒక్కసారి కూడా నీటి సరఫరా సక్రమంగా చేయట్లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు కుండలు, మంచినీటి బిందెలతో నిరసన తెలిపారు. తమతో పన్నులు కట్టించుకుంటూ నీటి సరఫరా ఎందుకు చేయట్లేదని మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. వెంటనే తమ కాలనీలకు నీటి సరఫరాను అందించాలని, లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : 'పరీక్షలే సక్రమంగా నిర్వహించలేదు.. ప్రధాని అవుతారా?'