ETV Bharat / state

'మాస్కులు ధరించండి... సామాజిక దూరం పాటించండి'

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి ఒకరు బయటకు రావాలని... కూరగాయల మార్కెట్​కు వెళ్లేవారు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు.

mla sudheer reddy on sanitation at lb nagar
'మాస్కులు ధరించండి... సామాజిక దూరం పాటించండి'
author img

By

Published : Mar 28, 2020, 12:41 PM IST

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఎల్బీనగర్​ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్​ రెడ్డి, ఎన్ఫోర్స్​మెంట్ అధికారితో కలిసి నియోజకవర్గం పరిధిలోని కామినేని ఆస్పత్రిని పరిశీలించారు.

'మాస్కులు ధరించండి... సామాజిక దూరం పాటించండి'

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల కరోనాను నివారించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. కూరగాయల మార్కెట్​కి వచ్చే వారు కూడా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. రెండూ మూడు రోజుల్లో మార్కెట్​లను ఖాళీగా ఉండే ప్రదేశాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణాన్ని సోడియం హైపో క్లోరైడ్​ ద్రావణంతో పిచికారీ చేయించారు.

ఇవీచూడండి: కరోనా పనిపట్టాలి.. వారు ఎవరిని కలిశారో కనిపెట్టాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.