రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో తెరాస విజయ దుందుభి మోగించిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. తుర్కయంజాల్ పీఏసీఎస్ ఎన్నికల్లో ఛైర్మన్గా గెలుపొందిన సత్తయ్యను కలిసి ఆయనను అభినందించారు.
ఆదివారం ఏడు సంఘాల్లో జరిగిన ఛైర్మన్ నియామకంలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుపొందారని.. ఇవాళ మిగతా రెండు స్థానాల్లో తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. అందుకే ప్రతి ఎన్నికల ఫలితాలు తమవైపే వస్తున్నాయన్నారు.
ఇదీ చదవండిః సినీ నటుడు బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ