పేదవారి ఆకలి తీర్చడానికి నామమాత్రపు రుసుముతో కల్పవృక్ష ఫౌండేషన్ నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయులని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ (Anjaiah yadav) అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పట్టణంలోని గ్రంథాలయం ఎదుట కల్పవృక్ష ఫౌండేషన్ నిర్వాహకులు నాగిళ్ల కుమార్నా, నాగిళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్నపూర్ణాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పురపాలక ఛైర్మన్ నరేందర్ నిర్వాహకులతో కలిసి హోమం నిర్వహించారు.
అనంతరం పురపాలిక ఛైర్మన్ నరేందర్ రూ.10 కి భోజనాన్ని ప్రారంభించారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ఆర్థికంగా వెనుకబడిన వారికి అన్నపూర్ణాలయం ద్వారా అందించే భోజనం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిరోజు వంద మందికి రుచికరమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, యాదగిరి సన్నిధానం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చుడండి: high court: మెడపై కత్తి పెట్టి డబ్బులిప్పించాలి.. తల నరికేస్తే ఏం లాభం?: