Minister Talasani: గత ప్రభుత్వాలు గొల్ల, కురుమలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం మాత్రమే వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని కురుమ సంక్షేమ భవన్లో నిర్వహించిన కురుమ సంఘం దసరా-దీపావళి సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేశారు.
రెండు విడతల్లో 11 వేల కోట్లు
talasani on sheep scheme: గొల్ల, కురుమల కులవృత్తి అయిన గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొల్ల, కురుమలకు 75 శాతం రాయితీతో గొర్రెలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రెండు దఫాలుగా గొర్రెల పంపిణీ కోసం రూ.11 వేల కోట్ల వ్యయం చేసినట్లు వివరించారు.
talasani at kokapet: కురుమ, యాదవ సంక్షేమ భవనాల కోసం 300 కోట్ల రూపాయల విలువ చేసే ఐదెకరాలు భూమితో పాటు నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ భవనాల కోసం భూమి, నిధులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మాజీ మంత్రి రేవన్న, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, యూపీకి చెందిన మనోజ్ పాల్, తమిళనాడుకు చెందిన వీరభద్రయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
గొల్ల కురుమలు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మన కులవృత్తి అయిన గొర్రెల పెంపకానికి మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయలు, రెండో విడత ఆరువేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటికే 50శాతం గొల్ల,కురుమలకు 75 శాతం సబ్సీడీతో గొర్రెలు పంపిణీ చేసిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి. ఆరోజు మీటింగ్‌లో చాలామంది అడిగిర్రు. ఇతరులు కూడా గొర్లు పెంచుతారు కదా మరీ వాళ్లకు కూడా ఇద్దామా అని చెప్పి కొందరు అడిగిర్రు. అప్పుడు సీఎం ఒకటే చెప్పారు. అసలు గొర్ల పెంపకమనేది పుట్టింది గొల్ల కురుమల కుటుంబాలలో వాళ్లకు తప్ప ఎవరికీ ఇవ్వమని చెప్పిర్రు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్లు రాగానే కొందరు వస్తారు మన గొల్ల కురుమల సంఘం అని చెప్పి ఓట్లు వేయించుకుని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు. గొల్ల కురుమలు ఎన్ని కుటుంబాలుంటే అందరికీ ఇవ్వమని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
-తలసాని శ్రీనివాస్, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి