Minister Sabita Initiated Many Development Works: రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్లో రూ.40 లక్షలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ కాలనీలో డ్రైనేజీ, వాటర్, సీసీ రోడ్లు సౌకర్యాలను కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామని ఆమె అన్నారు.
బీజేపీ నాయకులకు కేసీఆర్ను తిట్టడం తప్ప ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం చేతకాదని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ.. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపెడుతున్నారని విమర్శించారు. కేంద్రం అభిలంభిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
'గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ఏ విధంగా ఐతే అధికారంలో ఉన్నారో, ఈ 9 సంవత్సరాలు బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉందన్న విషయాన్ని వాళ్లు మరిచిపోతున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తారు. కానీ మన రాష్ట్రానికి కావాల్సిన నిధులకు మొకాళ్లు అడ్డుతున్న సందర్భాన్ని చదువుకున్న వాళ్లు ఖచ్చితంగా ఆలోచించాలి'. -సబితా ఇంద్రారెడ్డి, మంత్రి
ఇవీ చదవండి: