రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి జహంగీర్ పీర్ దర్గా వెళ్లే రహదారికి పరిశ్రమలు, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్, భాజపా తీరుపై మంత్రి మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా, కాంగ్రెస్ నాయకులు మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, రైతుబంధు లాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేక పోతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ చరిత్ర అని కొనియాడారు. నిరంతరం ప్రజల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టపడుతున్నారన్నారు.
ఇవీ చూడండి : రికార్డు: 73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు