ETV Bharat / state

ప్రశ్నించడం కాదు పరిష్కారం చేసి చూపిస్తాం: మంత్రి హరీశ్ - తెలంగాణ వార్తలు

రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి తరఫున ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆమె మంచి విద్యావేత్త, సేవాభావం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రశ్నించడం కాదు తాము పరిష్కారం చేసేవాళ్లం అని అన్నారు.

minister harish rao participated in mlc election campaign candidate for surabhi vani devi at ibrahimpatnam in rangareddy
ప్రశ్నించడం కాదు పరిష్కారం చేసి చూపిస్తాం: మంత్రి హరీశ్
author img

By

Published : Feb 27, 2021, 1:56 PM IST

భాజపా, కాంగ్రెస్ పార్టీలకు‌ లేని నెట్​వర్క్ తమకుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు.

కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయమని అభ్యర్థులకు, కార్యకర్తలకు సూచించారు. ఓటరును నేరుగా కలిసి తెరాసకు ఎందుకు ఓటు వేయాలో‌ వివరించాలని దిశానిర్దేశం చేశారు. భాజపా అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికి ‌తాగు నీరు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆరోపించారు. రాష్ట్రం వచ్చేనాటికి విద్యుత్ 7,778 మెగా వాట్లు కాగా... నేడు 16 వేల మెగా వాట్లకు చేరిందని అన్నారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతానికి రూ.400 కోట్లు ఇస్తామని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇతర పార్టీల నేతలు ప్రశ్నించే‌ గొంతు అంటున్నారు కాని మేము పరిష్కారం‌ చేసి చూపిస్తామని అన్నారు. సురభి వాణీ దేవి పీవీ కుమార్తె కాకుండా ‌విద్యావేత్త, సేవా భావం కలిగిన వ్యక్తి అని చెప్పారు. ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి: యాదాద్రి ప్రధాన ఆలయాలకు ప్రత్యేక శోభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.