రాష్ట్రంలో పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో చెక్‌పోస్టుల వద్ద లాక్‌డౌన్ తీరును సీపీలు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఇప్పటి వరకు 11,513 కేసులు... సైబరాబాద్ కమిషనరేట్‌లో 58,050 కేసులు నమోదయ్యాయి. మొత్తం 15,817 వాహనాలను స్వాధీనం చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, కొత్తూరు, నందిగామలో పోలీసులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి వచ్చిన వాహనాలకు చలాన్లు విధించారు.
లాక్‌డౌన్ తనిఖీల్లో భాగంగా దొంగనోట్లు తరలిస్తున్న ముగ్గుర్ని రామచంద్రాపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఒంగోలుకు చెందిన శివనారాయణ రెడ్డి 6 లక్షల రూపాయల నకిలీ నోట్లతో పోలీసులకు పట్టుబడ్డాడు. మరోవైపు లాక్‌డౌన్ పొడిగింపుపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఆంక్షలు పొడిగిస్తే మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: lockdown: రాష్ట్రంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు