రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలక సంఘం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు ముగిశాయి. స్థానిక ఫంక్షన్ హాల్లో అధికారులు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ.. వీటిని నిర్వహించారు. ఎంఐఎం నుంచి ఇద్దరు, తెరాస నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎంఐఎం నుంచి ఉస్మాన్ బిన్ షరీఫ్ హస్సన్ గాలిబ్, ఫరీదా అన్వర్ పటేల్, తెరాస నుంచి సురెడ్డి కృష్ణారెడ్డిలు ఎన్నికయ్యారు. జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లా సాది, కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎలాంటి వివాదస్పద ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'