ETV Bharat / state

HMDA: హెచ్‌ఎండీఏకు కలిసొస్తున్న భూముల సేకరణ... తదుపరి లక్ష్యం 11 వేల ఎకరాలు!

author img

By

Published : Nov 19, 2021, 4:53 PM IST

భూముల సేకరణ.. అభివృద్ధి.. విక్రయాలు హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA)కు పైసల పంట పండిస్తున్నాయి. గతంలో ల్యాండ్‌ పూలింగ్‌ పథకం (Land pooling scheme) ద్వారా వందల కోట్ల నిధులు సమీకరించిన హెచ్‌ఎండీఏ ఇప్పుడు మరో మూడు జిల్లాల్లో భూములను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 11 వేల ఎకరాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించే ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

HMDA
HMDA

ఉప్పల్‌ భగాయత్‌లో రైతుల నుంచి సేకరించిన 733 ఎకరాలు హెచ్‌ఎండీఏకు (HMDA) కలిసొచ్చాయి. ఆ తర్వాత మూడేళ్లలో మూడుసార్లు భూముల విక్రయాల ద్వారా దాదాపు రూ.3300 కోట్లు ఖజానాలోకి చేరాయి. మరోసారి పెద్దఎత్తున భూముల్ని సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో మొత్తం 35 ప్రాంతాల్లో 11వేల ఎకరాలు సేకరించే ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులతో ఒప్పందం పూర్తికాగా.. మిగతా వారిని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

ఓఆర్‌ఆర్‌ చుట్టూరా..

ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఎల్‌పీఎస్‌ (Land pooling scheme) కింద సేకరించనున్న భూముల్లో దాదాపు 9,700 ఎకరాలు బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) కూడళ్లకు (outer ring road) సమీపంలో 29 ప్రాంతాల్లో గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 1,315 ఎకరాలు మరో 7 ప్రాంతాల్లో గుర్తించారు. చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపూర్‌ పరిధిలో దాదాపు 355 ఎకరాలు, కీసర మండలం భోగారం పరిధిలో సుమారు 336, శంకర్‌పల్లి పరిధిలో 300, కందుకూరులో 150, కొత్తూరు, ఇన్మూల్‌నర్వ ప్రాంతాల్లో 96, కందుకూరు, లేమూరు ప్రాంతాల్లో 104 ఎకరాల భూమిని సేకరించి అభివృద్ధి చేయనున్నారు. ఓఆర్ఆర్ జంక్షన్ల వద్ద సేకరించిన భూమిని అభివృద్ధి చేయటంతో నగరంపై ఒత్తిడి తగ్గి... బయట టౌన్​షిప్ నిర్మాణాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. దీంతో విశ్వనగర అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవచ్చని వెల్లడించారు.

భూములు ఇచ్చేందుకు ఆసక్తి...

ఇటీవలే ల్యాండ్‌ పూలింగ్‌ పథకంలోని (Land pooling scheme) పలు నిబంధనలను ప్రభుత్వం మార్చింది. అభివృద్ధి చేసిన భూముల్లో యజమానులకు 60శాతం, హెచ్‌ఎండీఏకు 40శాతం తీసుకునే విధంగా మార్పులు చేసింది. దీంతో గతంలో లాగా వెనకడుగు వేయకుండా ఎక్కువ మంది భూములు ఇచ్చేందుకూ ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో83 ద్వారా అభివృద్ధి చేసిన భూమిలో 40శాతం హెచ్‌ఎండీఏ ఈ-వేలం ద్వారా విక్రయించనుండగా, 60శాతం భూమికి ‘హెచ్‌ఎండీఏ బ్రాండ్‌’ దక్కనుంది. ఆ ప్రాంతంలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తులాంటి వసతుల్ని అభివృద్ధి చేయనున్నారు. ఉప్పల్ భగాయత్‌లో 44ప్లాట్ల విక్రయంతో పాటుగా ఈ లక్ష్యం కూడా పూర్తయితే హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ఖజానాలోకి భారీగా నిధులు చేరడంతో అభివృద్ధి పనులకు ముందడుగు పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల విశేషాలు..

మొత్తం 1.35 లక్షల చదరపు గజాల్లో 44 ప్లాట్లు అభివృద్ధి చేశారు. వీటిలో 21 నివాసానికి, 15 బహుళ వినియోగాలకు, మరో 4 ప్లాట్లు షాపింగ్‌, వినోద కేంద్రాలకు, 2 ప్లాట్లు ఆసుపత్రులకు, 2 విద్యా సంస్థలకు కేటాయించనున్నారు.

  • డిసెంబరు 2, 3 తేదీల్లో జరిగే ఈ-వేలంలో పాల్గొని ప్లాట్లు దక్కించుకున్న వారు 90 రోజుల్లో పూర్తి స్థాయి చెల్లింపులు చేస్తే తర్వాతి 15రోజుల్లో హెచ్‌ఎండీఏ వారికి ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయిస్తుంది.
  • కొనుగోలుదారులు ప్లాట్‌ మొత్తం విలువలో 25శాతం చెల్లిస్తే మిగతా మొత్తం బ్యాంకు రుణంగా పొందే అవకాశం ఉంది. దానికి హెచ్‌ఎండీఏ నిరంభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇస్తుంది.
  • ఉప్పల్‌ భగాయత్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నా.. భవన నిర్మాణ అనుమతులు హెచ్‌ఎండీఏ మాత్రమే ఇస్తుంది.
  • రిజిస్ట్రేషన్‌కు తుది గడువు: నవంబరు 30, సాయంత్రం 5గంటల దాకా..
  • ఈఎండీ చెల్లింపునకు తుది గడువు: నవంబరు 30, సాయంత్రం 5గంటల దాకా..
  • ఈ-వేలం జరిగేది: డిసెంబరు 2, 3 తేదీల్లో..
  • మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 12గంటల దాకా రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 నుంచి 5గంటల దాకా..
  • చదరపు గజానికి నిర్ధారిత ధర: రూ.35 వేలు..

ఇదీ చదవండి: HMDA: రంగారెడ్డిలో రెండు లేఅవుట్ల అభివృద్ధికి రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.