- " class="align-text-top noRightClick twitterSection" data="">
Ibrahimpatnam, Telangana Assembly Election 2023 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్లకు సీలు లేకపోవడంపై కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్ధుల ఏజెంట్లు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆర్డోవో అనంతరెడ్డి ఉద్దేశపూర్వకంగానే పోస్టల్ బ్యాలెట్లు ఉన్న డబ్బాల సీలు తొలగించారని వారు ఆందోళనకు దిగారు. చాలా డబ్బాలు సీళ్లు తొలగించారని ఒక దశలో ఆర్డోవో కార్యాలయంలోకి దూసుకుకెళ్లారు. ఆర్డీవో అనంతరెడ్డిపై దాడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆయనపై చర్యలు తీసుకుని సీలు ఎందుకు తెరిచారో తెలిపే దాకా తాము కదిలేది లేదంటూ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెర - ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ స్టార్ట్
"కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థులు కొన్ని ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌పై కొన్ని అనుమానాలు ఉన్నాయని. పోస్టల్ బ్యాలెట్‌పై ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది .ఏం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకొని.. దర్యాప్తు చేపట్టాకే దానికి తగిన చర్యలు తీసుకుంటాం" - భారతి హోలికేరి, రంగారెడ్డి కలెక్టర్
Postal Ballot Issue At Ibrahimpatnam : ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పాస్‌లు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీలు తెరిచి ఉండడాన్ని గమనించి ఆర్టీవోను ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పేలోపే కార్యకర్తలు లోపలికి దూసుకెళ్లారు. సమాచారం తెలుసుకుని మరింత మంది కార్యకర్తలు అక్కడకు చేరుకుని నినాదాలు చేస్తూ బైఠాయించడం కొంత ఉద్రిక్తతకు దారితీసింది.
8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ షూరూ - 10గంటలకు తొలి ఫలితం!
పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పోలింగ్ పూర్తయినా పోస్టల్ బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలోనే ఎందుకు భద్రపరిచారని వారు ప్రశ్నించారు. ఈ ఈసీ మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఆర్డీవో వ్యవహరించారని మండిపడ్డారు. ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి విచారణ జరిపారు. కాంగ్రెస్ అభ్యర్ధి మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు రాంరెడ్డి కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని భారతి హోలికేరి హామీ ఇచ్చారు.
"మా ఏజెంట్ సంతకాలతో బ్యాలెట్లను సీలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అవి ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. పోస్టల్ బ్యాలెట్లో రిటర్నింగ్ ఆఫిీర్ తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. కొన్ని విషయాలపై మా అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. కౌంటింగ్ పూర్తి అయ్యేలోగా చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇందులో ఆర్టీవో, ఆర్వో తప్పు ఉందని నేను భావిస్తున్నాను." - మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ నేత
Ibrahimpatnam Postal Ballot Issue : పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీలు ఎందుకు వేయలేదో..అనుమానాలున్నాయన్న మల్‌రెడ్డి స్పష్టత ఇస్తేనే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సహకరిస్తామని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల లెక్కింపు వేళ ఇబ్రహీంపట్నం ఫలితాల వెల్లడిలో జాప్యం, వివాదం రాజుకున్న నేపథ్యంలో అధికారులు అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు.
ఓపెన్ చేసి ఉన్న పోస్టల్ బ్యాలెట్ బాక్సులు - ఆందోళనలో కాంగ్రెస్ నేతలు