Hayathnagar Police Arrested Drug Gang : మాదకద్రవ్యాలను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను హయత్‌నగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్వోటీ బృంద పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఇద్దరిలో ఒకరు మైనర్ కాగా మరొకరు బీఫార్మసీ విద్యార్ధి. వీరిద్దరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన అశోక్ కుమార్, జాలోర్ జిల్లా సర్వన గ్రామానికి చెందిన మైనర్ బాలుడు ఇద్దరు హెరాయిన్ సేవించడానికి అలవాటుపడ్డారు.
CP Sudheer Babu on Drug Gang : ఆ తర్వాత వారిద్దరు విక్రేతలుగా మారారు. హెరాయిన్‌ను(Heroin) రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి నగరంలోని లారీ డ్రైవర్లు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. రాజస్థాన్‌లో ఒక గ్రాము హెరాయిన్ 5 వేల రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఒక గ్రాము 10 నుంచి 12 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. వీరిద్దరిని హయత్‌నగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులు నగరంలో ఎవరెవరికి హెరాయిన్ మత్తు పదార్ధాలు విక్రయించారని, ఇంకా వీరి వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు సీపీ సుధీర్‌బాబు చెప్పారు.
'మాదకద్రవ్యాలపై పోలీసులు చేపడుతున్న చెకింగ్‌లో ఇవాళ ఇద్దరిని పట్టుకున్నాం. వారి నుంచి 80గ్రాముల హెరాయిున్ను స్వాధీనం చేసుకున్నాం. వీటిని రాజస్థాన్ నుంచి తరలిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం. వీరిద్దరిలో ఒకరు బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉన్నాడు. అతను రాజస్థాన్ వాసి, ప్రస్తుతం నగరంలోని లంగర్‌హౌస్ ఉంటున్నాడు. పట్టుబడ్డ రెండో వ్యక్తి మైనర్ బాలుడు కావడంతో పేరును ప్రకటించడం లేదు. వీరిద్దరు రాజస్థాన్ నుంచి డ్రగ్స్‌ను తీసుకుని రాష్ట్రంలో వివిధ రకాలుగా లారీ డ్రైవర్లుకు, విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఎంత మంది డ్రగ్స్‌ను తీసుకున్నారనే కోణంలో విచారణ చేస్తున్నాం' - సుధీర్‌బాబు, రాచకొండ సీపీ
రాష్ట్రంలో మరో 2 డ్రగ్స్ గ్యాంగుల పట్టివేత, అరెస్టైన వారిలో 21 ఏళ్ల యువతి
డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం - మూడు వేర్వేరు గ్యాంగుల పట్టివేత