రంగారెడ్డి జిల్లా యాచారం ఎంపీపీ సుకన్యను మాజీ ఎంపీ వివేక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డిలు పరామర్శించారు. యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ఫార్మాసిటీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ ప్రారంభోత్సవానికి యాచారం ఎంపీపీ సుకన్యని ఆహ్వానించలేదని, అడిగినా పట్టించుకోకుండా ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే, పోలీసులు ఎంపీపీని నెట్టివేయడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యారని అన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే అహంకారంతో వ్యవహరిస్తున్నారని, కనీసం ప్రోటోకాల్ పాటించకుండా మహిళా ఎంపీపీ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరికాదని వారు అన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎంపీపీపై ఎమ్మెల్యే తీరు సరికాదని తెలిపారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే మాట్లాడలేని భాషను ఉపయోగించిన విషయంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణలో ప్రశ్నిస్తే కూడా దాడిచేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై చర్యలు తీసుకునేంతవరకు ఎంపీపీ సుకన్యకు అండగా ఉంటామని వారు చెప్పారు.
ఇదీ చూడండి : మరో పదివారాలు డ్రైడే కార్యక్రమం.. సీజనల్ వ్యాధులపై సమరం