రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామ సర్పంచ్ రాంరెడ్డి.. ఊరంతా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కొన్ని రోజులుగా ఉపాధి లేక ప్రజలు పస్తులుంటున్నారని తెలుసుకున్న ఆయన... వారికోసం తన సొంత నిధులతో కందిపప్పు, చక్కెర, వంట నూనె, ఉల్లిపాయలు వంటి సామగ్రిని అందించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపును ప్రజలందరూ స్వాగతించారని సర్పంచ్ రాంరెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే స్వీయ నిర్బంధం అవసరమన్నారు.
ఇదీ చదవండి: ఆ సొరంగంలో నడిస్తే కరోనా వైరస్ హతం