సనత్నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్లోని దాసారం బస్తీలో శరణం కార్పొరేషన్ అధ్యక్షులు విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పేదలకు, నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎస్.ఆర్.నగర్ సీఐ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 500 మంది నిరుపేదలకు సరుకులను అందజేశారు.
కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని విజయ భాస్కర్ పేర్కొన్నారు. ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా చీకటిపై దివ్వెల కాంతులతో దేశం పోరు