ETV Bharat / state

అక్రమ కట్టడాల కూల్చివేత.. ఘర్షణకు దిగిన స్థానికులు - మైలార్‌ దేవులపల్లిలో ఉద్రిక్తత వాతావరణం

రంగారెడ్డి జిల్లా మైలార్‌ దేవులపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడాల కూల్చివేత ఘర్షణకు కారణమైంది. సర్వే నంబర్ 156/1లోని ప్రభుత్వ స్థలంలో కొంతమంది స్థానికులు అక్రమంగా 25 ఇళ్లు నిర్మాణాలు చేపట్టగా.. వాటిని రెవెన్యూ అధికారులు కూలగొట్టారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు జేసీబీ వాహనాలను ధ్వంసం చేశారు.

అక్రమ కట్టడాల కూల్చివేత.. ఘర్షణకు దిగిన స్థానికులు

author img

By

Published : Jul 29, 2020, 12:51 PM IST

నగర శివారు రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడాల కూల్చివేతతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సర్వే నంబర్ 156/1 లో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంతమంది స్థానికులు అక్రమంగా 25 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు హెచ్చరించిన రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టారు. పోలీస్ బలగాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో ఆగ్రహించిన సదరు స్థానికులు జేసీబీ వాహనాలను ధ్వంసం చేశారు.

అద్దాలు పగులగొట్టి , అధికారులను పరుషజాలంతో మాట్లాడి హంగామా సృష్టించారు. ఆపై రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతోనే తాము ఇళ్లు నిర్మించుకున్నామని వారు తెలిపారు. అయితే ఆ స్థలం వివాదాస్పద స్థలమని.. అది కోర్టు పరిధిలో ఉన్నందున ఎలాంటి కట్టడాలు చేపట్టరాదని రెవెన్యూ అధికారులు తెలిపారు. చివరకు పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.