Investigation Operations Center: సైబర్ నేరాల్లో పరిశోధన, కేసుల పరిష్కారం కోసం ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబర్ నేరాలు, నియంత్రణ అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సైబర్ క్రైమ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసి త్వరితగతిన కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని సీపీ ఆదేశించారు.
సైబర్ కేసుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని సీపీ తెలిపారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు దర్యాప్తు అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలు, సాంకేతిక నిపుణుల సహకారం తీసుకోవాలన్నారు. సైబర్ మోసాలపై ఫిర్యాదు అందగానే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. జైళ్లలో ఉన్న వంద మంది నిందితులను.... తమ కేసుల్లో పీటీ వారెంట్‌పై కస్టడీకి తీసుకుని విచారించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: