ETV Bharat / entertainment

ఆ హీరోయిన్​తో కలిసి యూరప్​కు 'రాజాసాబ్' ప్రభాస్! - RAJASAAB MOVIE SONG SHOOTING

'రాజాసాబ్​' మూవీ షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే?

Prabhas Rajasaab Movie Song Shooting
Prabhas Rajasaab Movie Song Shooting (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 8:11 AM IST

Rajasaab Movie Song Shooting : సలార్‌, కల్కి 2898 ఎ.డి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్​, త్వరలోనే రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మిగిలిన చిత్రీకరణను కూడా చకచకా పూర్తి చేసే పనిలో చిత్ర బృందం బిజీ అయింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో యూరప్‌లో ఓ సాంగ్​ను షూటింగ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఇది సినిమాలో ప్రభాస్, మాళవిక మోహనన్‌ మధ్య వచ్చే డ్యూయెట్‌ సాంగ్ తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా తొలి గీతాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, జనవరి నాటికి ఎలాగైనా షూటింగ్​ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వినోదం నిండిన హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంగా సినిమాను ముస్తాబు చేస్తున్నారు. మారుతి - ప్రభాస్‌ కాంబోలో వస్తోన్న తొలి చిత్రమిది. చిత్రంలో ప్రభాస్‌ రెండు భిన్న కోణాలున్న పాత్రలో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్‌ పళని ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకుంటున్నారు. పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీపై ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

'కాంతార' మూవీ టీమ్ బస్సు బోల్తా - 20 మందికి గాయాలు

ఈ వారమే OTTలోకి భారీ బ్లాక్ ​బస్టర్​ సినిమా - ఇంకా థియేటర్లలో రానున్న చిత్రాలేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.