రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పల్లెచెల్క తండా సమీపంలో కారు అగ్ని ప్రమాదానికి గురైంది. చరిగొండ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఒక్కసారిగా కారులోంచి పొగలు వ్యాపించాయి. చరిగొండకు చెందిన మహేష్, సాయి, శివ ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా కారులో నుంచి పొగలు వస్తున్నట్టు గమనించారు. కారు దిగి అప్రమత్తమయ్యే లోపు మంటలు చెలరేగాయి.
కారులో ఉన్న సామగ్రిని బయటకు తీసి, మంటలు ఆర్పేందుకు నీళ్లు తెచ్చే లోపే మంటలు విపరీతంగా పెరిగాయి. పరిస్థితి చేయిదాటిపోయి కారు పూర్తిగా దగ్ధమైంది. కారు కాలిపోయినా.. ప్రాణనష్టం జరగలేదు.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: ఫ్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు