ETV Bharat / state

తలసేమియా, క్యాన్సర్​ రోగుల కోసం రక్తదానం - తలసేమియా రోగుల కోసం రక్తదానం శిబిరం

రంగారెడ్డి జిల్లా అప్పోజీ గూడలో తలసేమియా, క్యాన్సర్​ బాధితుల కోసం లక్ష్య సాధన ఫౌండేషన్​ రక్తదానం శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 70 మంది యువకులు రక్తదానం చేశారు. వారందరికీ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు ప్రజ్ఞ రాజు కృతజ్ఞతలు తెలిపారు.

తలసేమియా, క్యాన్సర్​ రోగుల కోసం రక్తదానం

author img

By

Published : Apr 20, 2020, 10:48 AM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పోజీ గూడలో లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్య సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజ్ఞ రాజు, గ్రామ సర్పంచ్ రాజు పాల్గొనగా 70 మంది యువకులు రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని.. తలసేమియా, క్యాన్సర్ బాధితులకు అండగా ఉండటం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రజ్ఞరాజు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

ఇదీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.