రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజు తేడాలోనే రెండో కేసు నమోదైంది. మొదట పాజిటివ్ వచ్చిన వ్యక్తి తన స్నేహితుడితో కలిసి కరోనా సోకి చనిపోయిన బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చారు. ఆదివారం అతని మిత్రుడి కూడా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీనితో అధికారులు, పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
షాద్నగర్ పట్టణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సోమవారం నుంచి కిరణా, పాలు, మెడికల్ షాప్లు మినహా అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.