చిలుకూరు బాలాజీని దర్శించుకున్న అమెరికన్ కాన్సులేట్ జనరల్ తమిళనాడులోని చెన్నైలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ జనరల్ జుడిత్ రేవిన్... రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ రేవిన్కు.. ఆలయ విశిష్టతను వివరించారు. స్వామివారు వీసాలు ఇప్పిస్తాడనే భక్తుల విశ్వాసం గురించి తెలిపారు. ఆలయమంతా కలియ తిరిగి పరిశీలించారు.
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న అమెరికన్ కాన్సులేట్ జనరల్ అనంతరం శివాలయానికి వెళ్లి సుందరేశ్వర స్వామివారిని రేవిన్ దర్శించుకున్నారు. దేవాలయం వెనకాల ఉండే చిలుకూరు బాలాజీ గోశాలలో కొంత సమయం సరదాగా గడిపారు. స్వామివారి కృప ద్వారా కరోనా మహమ్మారి వీలైనంత త్వరగా మాయం కావాలని... అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నట్టు రేవిన్ తెలిపారు. మోయినాబాద్ సీఐ రాజు వారి బృందం.. రేవిన్ ప్రయాణానికి బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఇదీ చూడండి: