సూపరింటెండెంట్ ఇంజినీరింగ్ ఆపరేషన్, సైబర్ సిటీ సర్కిల్ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో డివిజినల్ ఇంజినీర్ అధికారి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ అపార్ట్మెంట్కి సంబంధించి శివకుమార్ అనే కాంట్రాక్టర్ వద్ద నుంచి పానల్ బోర్డ్ ట్రాన్స్ఫర్ ఇవ్వడం కోసం రూ. 30,000లు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ బతిమిలాడగా రూ. 25 వేలకు ఒప్పుకున్నాడు. వెంకటరమణ ఇంట్లో రూ. 26 లక్షలు, 60 తులాల బంగారం గుర్తించారు. రూ. 3కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్‌ది బార్ బచావో.. బార్ బడావో నినాదం