రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన ఏడేళ్ల ఉమ్మె రుమాన్ ఖతూన్ తన శరీరంలోని కుడివైపు భాగంలో తరచుగా నొప్పితో బాధపడేది. తల్లిదండ్రులు చిన్నారిని ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మూత్రనాళంలో సుమారు 9 మి.మీ. రాయి ఉన్నట్లు గుర్తించారు.
రాయిని తొలగించేందుకు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని భావించిన వైద్యులు రెట్రోగ్రేడ్ ఇంట్రారెనల్ సర్జరీ (ఆర్ఐఆర్ఎస్) అనే అధునాతన విధానాన్ని ఉపయోగించారు.
జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం..
గతంలో చిన్నారుల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య అరుదుగా ఉండేదని.. గత 10 సంవత్సరాల కాలంలో ఈ తరహా ఆరోగ్య సమస్యలు తరచుగా సంభవిస్తున్నాయని అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్ సీఓఓ డా.మెర్విన్ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా పెరుగుతున్నట్లే.. వ్యాధుల్లో సైతం పెరుగుదల కనిపిస్తోందన్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఈ ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు.
ఇవీ చూడండి: డబ్ల్యుూఈఎఫ్కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్