ETV Bharat / state

పట్టుదలే ఆయుధమైతే... ఇంటింటికి  కానిస్టేబులే!!

పోలీసు ఉద్యోగమంటే కత్తిమీద సాము. కఠోర సాధన చేస్తే కానీ ఖాకీ చొక్కా ఒంటి మీదకు రాదు.  చదువు, తెలివితేటలు, దేహధారుడ్యం, ఆత్మవిశ్వాసం  కలగలసిన వారికే ఈ కొలువు సొంతం. పేదరికాన్ని అధిగమించటానికి, సమాజానికి సేవ చేయటానికి  కానిస్టేబుల్ ఉద్యోగంపై దృష్టి పెట్టారు... రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామ యువత. అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నించి.. ప్రతిభ చూపారు. గ్రామానికి చెందిన 30 మంది యువతీయువకులు .. తాజాగా వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించారు.

పట్టుదలే ఆయుధమైతే... ఇంటింటికి  కానిస్టేబులే!!
author img

By

Published : Sep 27, 2019, 12:50 PM IST

పట్టుదలే ఆయుధమైతే... ఇంటింటికి కానిస్టేబుల్‌

ఆలూరు....! నిన్న మొన్నటి వరకు ఇదొక చిన్న గ్రామం. నేడు పోలీసుల ఊరుగా రాష్ట్రమంతటా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామ జనాభా సుమారు 10 వేలు. గ్రామస్థులకు వ్యవసాయమే జీవనాధారం. తల్లిదండ్రులు సాగుతోపాటు కూలీనాలీ చేసుకొని తమ పిల్లల్ని చదివిస్తున్నారు. యువత కూడా కన్నవారికి సాయం చేస్తూనే... తమ కలల్ని నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే గ్రామానికి చెందిన 30 మంది యువత... తాజా తెలంగాణ రాష్ట్ర కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. ప్రభుత్వ కొలువులు సాధించారు.

పట్టుదలే ఆయుధం...

ఆలూరు గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారే. 70 మంది ఉపాధ్యాయులు, 40 మంది ఆర్టీసీ కండక్టర్లు, నలుగురు రైల్వే ఉద్యోగులు కాగా భారత సైన్యంలో 10 మంది వరకు పనిచేస్తున్నారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన స్థానిక యువత.. పోలీసు ఉద్యోగాలపై మక్కువ పెంచుకుంది. గ్రామ యువత ప్రతి రోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచి గ్రామంలోని పాఠశాల మైదానంలో దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. పరుగు, లాంగ్ జంప్, హై జంప్‌ సాధన చేసేవారు. అలా తాజాగా వెలువడిన ఫలితాల్లోనూ ఈ గ్రామానికి చెందిన 23 మంది అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు కానిస్టేబుల్స్​గా ఎంపికయ్యారు.

లక్ష్యం చేరేవరకు...

ఆ కుటుంబంలో ఐదుగురు ఆడపిల్లల్లో చిన్నది... శ్రీవాణి. ఇంట్లో ఒక్కరికన్న ఉద్యోగం రాలేదని బాధ పడే తండ్రి అభిలాషను నెరవేర్చి ఆ ఇంట ఆనందాన్ని నింపింది. కిరాణ కొట్టు నడుపుతూనే కానిస్టేబుల్ ఉద్యోగానికి కష్టపడింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన భువనేశ్వరికి చిన్న వయస్సులో పెళ్లైంది. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఆమె.. తల్లి వద్దే ఉంటూ కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించింది. వివాహ బంధంలో సమస్యలు వచ్చినా వాటన్నింటిని పక్కన పట్టి లక్ష్యం చేరుకుంది.

ఓటమి పలకరించినా...

కానిస్టేబుల్ అయిన తండ్రి అనుకోని కారణాల వల్ల ఉద్యోగానికి దూరం కావటం నర్సింగరావును బాధించింది. ఎలాగైనా కానిస్టేబుల్ కావాలని రెండు సార్లు ప్రయత్నించాడు. ఓటమి పలకరించినా పట్టుదలతో శ్రమించి... మూడోసారి అర్హత సాధించాడు. వ్యవసాయ పనులు చేస్తూనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇంటర్ చేసి ఎలక్ట్రిషియన్ పనిచేస్తున్న శివరాజ్... తమ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక్కరైనా సర్కారు కొలువు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించాడు.

పేదరికాన్ని జయిస్తూ...

నిరుపేద కుటుంబాలకు చెందిన రాఘవేంద్రచారి, ప్రవీణ్‌లు సైతం పేదరికాన్ని జయిస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రాఘవేంద్రచారి... సోదరుల స్ఫూర్తితో కొలువు సాధించగా...చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ప్రవీణ్‌... తల్లి కష్టాన్ని దూరం చేయాలని పట్టుదలతో విజయం సాధించాడు.

ఎంతో మందికి స్ఫూర్తి...

ఇలాంటి ఎంతో మంది నిరుపేద యువతీ యువకులు ఆలూరు గ్రామ స్ఫూర్తితో పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారు. గ్రామంలోని 60 శాతం మంది యువతీ యువకులు ప్రభుత్వ కొలువులు సాధించటం ఆలూరు పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తి నిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే డాక్టర్, టీచర్, పోలీసులు అవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ ఆ దిశగా శ్రమిస్తున్నారు.

ప్రత్యేకత చాటుకుంటూ...

1889 నుంచి పోలీసు ఉద్యోగాలకు ఎంపికవుతున్న ఆలూరు వాసులు... యేటికేడు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2011, 2013 లో 9 మంది, 2014 లో 8 మంది, 2016లో 14 మంది అర్హత సాధించగా 2018-19 ఫలితాల్లో ఆ సంఖ్య 30 మందికి పెరిగింది.

ఇవీ చూడండి: వాళ్లు చేప, చికెన్​ ముట్టుకోరు... ఎందుకంటే?

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.