కరోనా వైరస్ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాకు 450 మంది వచ్చారన్నారు. వారిని గుర్తించి 15 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని గ్రామీణ ప్రజలు గుర్తించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు