రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లె ప్రగతి లో పెండింగ్ లో ఉన్న పనులను జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని జడ్పీ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ తెలిపారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతి పనుల పురోగతిపై అన్ని మండలాల ఎంపీడీవోలతో అరుణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న వైకుంఠదామాలు, డంపింగ్ యార్డ్ లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం జిల్లాను పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని అధికారులను కోరారు.