రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని వెంకటాద్రి (గంగమ్మ) చెరువు కట్ట తెగిపోయి నీరు వృథాగా పోతోంది. గతంలో మిషన్ భగీరథ పైపు లైన్ కోసం కట్టకింది భాగంలో జేసీబీతో తవ్వించి తాత్కాలికంగా పూడ్చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి కట్ట తెగిపోయింది. ఖరీఫ్‌లో పంటలకు ఆ నీరు ఉపయోగపడుతుందని ఆశ పడ్డ రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే నీరంతా ఖాళీ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి చెరువు కట్టను బాగు చేయాలని కోరారు.
ఇవీ చూడండి: హాంగ్‌కాంగ్‌లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ