రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును ఎస్పీ రాహుల్ హెగ్డే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంటుందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు యధావిధిగా ప్రజారవాణా, అన్ని దుకాణ సముదాయాలు తెరిచి ఉంటాయని వెల్లడించారు. మినహాయింపు ఇచ్చిన సమయంలోనూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, మాస్క్‌లు ధరించాలని తెలిపారు. లేకుంటే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
అన్ని మండల కేంద్రాల్లో పెట్రోలింగ్, ముఖ్య కూడళ్లలో పికెట్స్, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పెళ్లిళ్లకు 40 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్కరు లాక్డౌన్ పాటించాలని, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్