ETV Bharat / state

వేములవాడ రాజన్న సన్నిధిలో నత్తనడకన శివరాత్రి ఏర్పాట్లు - telangana varthalu

కోరినవారికి కొంగు బంగారమై నిలిచేవాడు వేములవాడ రాజన్న. రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రం కావడం వల్ల ఇక్కడ శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతాయి. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడకు... వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. శివరాత్రికైతే... ఇసుక వేస్తే రాలనంత మంది స్వామి సన్నిధికి చేరుకుంటారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు భావించినా... ఏర్పాట్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.

వేములవాడ రాజన్న సన్నిధిలో నత్తనడకన శివరాత్రి ఏర్పాట్లు

author img

By

Published : Feb 27, 2021, 4:22 PM IST

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వసతుల లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు సిబ్బంది కొరతతో నిత్యం దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక రోజుల్లో 30 నుంచి 40 వేల మంది స్వామివారిని దర్శించుకోగా... మహాశివరాత్రికి రోజుకు దాదాపు 3లక్షలకు పైగా భక్తులు రాజన్నను దర్శించుకుంటారు. ఈ సారి జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆలయ నిధుల నుంచి కోటి యాభై లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. వీటికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తికాగా.. చాలా వరకు అధికారుల ఆమోదం, గుత్తేదారుల ఒప్పందం దశలోనే ఉన్నాయి. కొన్ని పనులు ప్రారంభమైనప్పటికీ నత్తనడకన సాగుతుండడం వల్ల జాతర వరకు పూర్తవుతాయా అనే అనుమానం ఉంది.

వేములవాడ రాజన్న సన్నిధిలో నత్తనడకన శివరాత్రి ఏర్పాట్లు

నీటికొరతతో ఇక్కట్లు

ఏటా గుడికి వచ్చే భక్తులు పెరుగుతున్నప్పటికీ... శాశ్వతంగా ఉండేలా అధికారులు సౌకర్యాలు కల్పించడంలేదు. జాతర సమయంలో కోట్లు ఖర్చుపెట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసినా... అవి మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. కరోనా కారణంగా ధర్మగుండంలో స్నానాలను నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా గుడిచెరువు మైదానంలో ట్యాంకర్ల ద్వారా స్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నీటి కొరత అధికంగా ఉండడం వల్ల 5 కోట్లతో మిషన్‌ భగీరథ పైపులైనును ఆలయంలోని సంపులకు అనుసంధానం చేశారు. సంపుల సామర్థ్యం 5 లక్షల లీటర్లే ఉండగా... ఎక్కువ నీరు నిల్వచేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ముందుకు సాగని పనులు

శివరాత్రికి నాలుగు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక మంత్రి కేటీఆర్‌ గతంలోనే అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు మూడు రోజులకొకసారి ఈ ఏర్పాట్లపై సమీక్ష జరిపినా... పనులు ముందుకు సాగడంలేదు. ఇప్పటికి చలువ పందిళ్లు, పార్కింగ్‌ స్థలం చదును, ఆలయ ఆవరణలో విద్యుత్‌ పనులు పూర్తి చేశారు. ఆలయ సత్రాల్లో 400 గదులు ఉన్నా... జాతరకు వచ్చే భక్తులకు సరిపోవు. కొత్తగా నిర్మించే 60 గదులు ఇంకా పూర్తికాలేదు. దీంతో భక్తులకు ప్రైవేటు గదుల భారం, ఆరుబయట విడిదితో కష్టాలు తప్పేలా లేదు.

ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి

సుదూర ప్రాంతాల నుంచి రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. ఏడాదికొకసారి వచ్చేవారు అధికసంఖ్యలోనే ఉంటారు. స్వామివారి దగ్గరికి వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. శివరాత్రినాటికి ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని అంటున్నారు.

ఇదీ చదవండి: ప్రశ్నించడం కాదు పరిష్కారం చేసి చూపిస్తాం: మంత్రి హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.