పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రజలపై మోయలేని విధంగా విద్యుత్ బిల్లుల భారాన్ని మోపిన ప్రభుత్వం తక్షణం ఉపశమన చర్యలు చేపట్టకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
3 నెలల కరెంట్ బిల్లుల భారం ఒకేసారి ప్రజలపై మోపడం వల్ల ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన స్లాబ్ ధరలను తగ్గించటంతో పాటు ఏప్రిల్, మే నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.